34 ఏళ్ల తర్వాత మెగాస్టార్​ను కలిసిన ఆ ముగ్గురు

84చూసినవారు
34 ఏళ్ల తర్వాత మెగాస్టార్​ను కలిసిన ఆ ముగ్గురు
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా వచ్చి దాదాపు 34 ఏళ్లు అవుతుంది. అయితే ఈ చిత్రంలో చిరుతో కలిసి షాలిని, షామిలి, రిషి చైల్డ్‌ ఆర్టిస్టులుగా అలరించిన విషయం తెలిసిందే. అయితే ఈ ముగ్గురు తాజాగా చిరును కలిశారు. ఆ ఫొటోను షామిలి ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌ అవుతోంది. అది చూసిన అభిమానులు ‘శ్రీదేవి ఉంటే ఇంకా బాగుండేది’ అని కామెంట్స్‌ చేస్తున్నారు.