సింహంతో టిక్‌టాక్… యువకుడికి తీవ్ర గాయాలు

74చూసినవారు
సింహంతో టిక్‌టాక్… యువకుడికి తీవ్ర గాయాలు
టిక్‌టాక్ వీడియో కోసం ఓ వ్యక్తి ఏకంగా సింహం బోనులోకి వెళ్లాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పంజాబ్ ప్రావిన్సుకు చెందిన ముహమ్మద్ అజీమ్.. లాహోర్ సమీపంలోని జూలో ఉన్న సింహంతో టిక్‌టాక్ కోసం బోనులోకి వెళ్లాడు. వెంటనే అది దాడి చేయడంతో కేకలు పెట్టాడు. వెంటనే స్పందించిన సిబ్బంది అతడిని రక్షించారు. ఈ దాడిలో తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.