గడిచిన పదేళ్లలో
ఐసీసీ ట్రోఫీలేవీ గెలవకపోవడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. భారత్‌కూ టైం వస్తుందని, గత మూడేళ్లగా ప్లేయర్స్ అద్భుతంగా ఆడుతున్నారని అన్నారు.
ఐసీసీ టోర్నీల్లో ఫైనల్స్ దగ్గర తప్పితే దాదాపు అన్నీ గెలిచామని, కచ్చితంగా అవీ గెలిచే సమయం వస్తుందని చెప్పారు. అయితే, అప్పటి వరకూ పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉండాలని, మున్ముందు బాగా ఆడటంపైనే దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు.