
ఏపీ రైతులకు తీపికబురు.. రూ.1,10,000 సాయం
AP: మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకునేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందన్నారు. అరటి రైతులకు హెక్టారుకు రూ.35 వేల వరకు ఇన్పుట్ సబ్సిడీ అందజేయడంతో పాటు మొక్కలు తిరిగి వేసుకునేందుకు అదనంగా హెక్టారుకు రూ.75 వేలు అందజేయడం జరుగుతుందన్నారు. మొత్తం రూ.1,10,000 వరకు రైతులకు సాయం అందజేస్తామన్నారు. ఇన్సూరెన్స్ ఉంటే వారికి అదనంగా చెల్లింపులు ఉంటాయన్నారు.