కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పౌరసత్వం అంశంలో కేంద్రానికి అలహాబాద్ హైకోర్టు నాలుగు వారాల గడువును నిర్దేశించింది. తదుపరి విచారణను లక్నో బెంచ్ ఏప్రిల్ 21కి వాయిదా వేసింది. ఆ లోగా రాహుల్ పౌరసత్వం అంశం తేల్చి.. స్టేటస్ రిపోర్ట్‌ను కేంద్రం కోర్టుకు సమర్పించాలి. రాహుల్ బ్రిటన్ పౌరుడని, భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, ఆ పార్టీ కార్యర్త విఘ్నేశ్ వేసిన పిటిషన్లపై హైకోర్టు తాజా ఆదేశాలు ఇచ్చింది.