ALERT: ఇవాళ 52 మండలాల్లో వడగాలులు

61చూసినవారు
ALERT: ఇవాళ 52 మండలాల్లో వడగాలులు
AP: రాష్ట్రంలో ఇవాళ 52, రేపు 88 మండలాల్లో వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మంగళవారం శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, విజయనగరం, కాకినాడ, ఏలూరు, తూ.గో. జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అలాగే పలు ప్రాంతాల్లో అకాల వర్షాలతో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్