ఇవాళ గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా రా.7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 5 మ్యాచుల్లో తలపడ్డాయి. గుజరాత్ 3, పంజాబ్ 2 మ్యాచుల్లో గెలిచాయి. కాగా, గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కప్ సాధించి పెట్టిన శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్‌లో పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. గుజరాత్ జట్టుకు గిల్ కెప్టెన్‌గా ఉన్నారు.