

భారీ భూకంపం.. థాయ్‌లాండ్ ఎయిర్‌పోర్టు లాక్డౌన్
మయన్మార్‌లో భారీ భూకంపం కారణంగా పొరుగున ఉన్న థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో తీవ్ర భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే థాయ్‌లాండ్ ఎయిర్‌పోర్టుకు లాక్డౌన్ విధించారు. అన్ని విమాన సర్వీసులు రద్దు చేశారు. థాయ్‌లాండ్‌కు వచ్చే విమానాలను దారి మళ్లించారు. పలు మార్లు ప్రకంపనలు చోటు చేసుకోవటంతో ప్రజలు ఇళ్ల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. బ్యాంకాక్‌లో ప్రకంపనల తీవ్రత 7.3గా నమోదైంది. ఇక థాయ్‌లాండ్‌లో ఎమర్జెన్సీ విధించారు.