Top 10 viral news 🔥
TG: అకౌంట్లోకి రుణమాఫీ డబ్బులు.. చెక్ చేసుకోండి!
తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే మూడు విడతల్లో రైతు రుణమాఫీ అందించిన ప్రభుత్వం, తాజాగా నాలుగో విడత నిధులను నవంబర్ 30న మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో జరిగిన రైతు పండుగ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. అయితే ఆ నిధులు సోమవారం (డిసెంబర్ 2) నుంచి రూ. 2లక్షల వరకు ఉన్న రైతుల అకౌంట్లోకి జమ కానున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.