విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లు (వీడియో)
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రుల ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 3-12 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో క్యూలైన్లు, ఇతర పనులను అధికారులు ప్రారంభించారు. అయితే ఇక్కడి ఏర్పాట్లపై ఏటా భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కనీస సౌకర్యాలు కల్పించరని, వీఐపీలకు ప్రాధాన్యం ఇస్తారనే విమర్శలొస్తున్నాయి. ఈ సారైనా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.