చెలరేగిన భారత బౌలర్లు.. టీ బ్రేక్ సమయానికి బంగ్లాదేశ్ స్కోర్ 112/8
భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. దీంతో టీ బ్రేక్ సమయానికి బంగ్లాదేశ్ 112/8 పరుగులు చేసింది. 264 పరుగులు వెనుకబడి ఉంది. మెహిది హసన్ మిరాజ్(12) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్‌దీప్ 2, బుమ్రా 3 వికెట్లు, జడేజా 2, సిరాజ్ ఒక వికెట్ తీశారు.