నేటి రాశి ఫలాలు (22-05-2024)

24630చూసినవారు
నేటి రాశి ఫలాలు (22-05-2024)
మేషం
చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

వృషభం
ప్రయాణాలు జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలక విషయాలలో శ్రమపడ్డా ఫలితం లభించదు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు స్వల్పంగా లభిస్తాయి. ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది.

మిధునం
ఆత్మీయుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. మంచి మాట తీరుతో ఇంటా బయట అందర్నీ ఆకట్టుకుంటారు. చేపట్టిన పనులు నూతనోత్సాహంతో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

కర్కాటకం
ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు.

సింహం
వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. చేపట్టిన వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. గృహ వాతావరణం చికాగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

కన్య
ఆర్థిక వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కష్టపడ్డా ఫలితం ఉండదు. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. గృహమును కొందరు ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది.

తుల
కీలక వ్యవహారంలో అందరిని ఒక మాట మీదకు తీసుకువస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాలు కొంత సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

వృశ్చికం
ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

ధనస్సు
సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగుల శ్రమ ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. నూతన మిత్రులు పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

మకరం
ధన పరంగా ఒడిదొడుకులు అధికమవుతాయి. ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు అధికమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు పనిభారం ఉంటుంది.

కుంభం
సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారులు సహాయ సహకారాలతో నూతన అవకాశాలు అందుకుంటారు.

మీనం
చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. భూ క్రయవిక్రయాలలో నూతన సంబంధిత లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వాహనాలు కలత కలుగుతుంది. వ్యాపారాలలో భాగస్వామితో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగాలు గతం కంటే మెరుగైన వాతావరణం ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్