రీల్స్ చేస్తూ ఒక్కసారిగా లోయలో పడిన మహిళ (షాకింగ్ వీడియో)

50చూసినవారు
హిమాచల్ ప్రదేశ్‌లో ఓ యువతి రీల్స్ చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంది. యువతి రీల్స్ చేయడానికి లోయలో రాయిపైకి ఎక్కి నుంచొని ఉంది. కెమెరామన్ స్టార్ట్ అనగానే ‘బేపనా ప్యార్ హై, తేరా ఇంతెజార్ హై’ పాటకు డ్యాన్స్ చేస్తూ చేతులూపింది. అనంతరం తిరిగి వస్తుండగా కాలు జారి కిందికి దొర్లుకుంటూ పడిపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్