వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన సీఎం చంద్రబాబు

56చూసినవారు
వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన సీఎం చంద్రబాబు
ఏపీలో వరద బాధితులకు సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. "వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కట్టిస్తాం. ప్రతి ఇంటికి రూ.25వేలు ఆర్థిక సాయం.. మొదటి అంతస్తులో ఉండే వారికి రూ.10వేలు, ఇళ్లలోకి నీళ్లు వచ్చిన వారికి రూ.10వేలు, చిరు వ్యాపారులకు రూ.25వేల చొప్పున పరిహారం ఇస్తాం. టూవీలర్స్‌కు రూ.3వేలు, మూడు చక్రాల వాహనాలకు రూ.10 వేలు చొప్పున ఇస్తాం. పశువులకు రూ.50వేలు. వరి ఎకరాకు రూ.10వేలు, చెరకు రూ.25వేలు చొప్పున పరిహారం చెల్లిస్తాం’’ అని సీఎం ప్రకటించారు.

సంబంధిత పోస్ట్