విషాదం: మారథాన్ ప్రపంచ విజేత కెల్విన్ మృతి

66చూసినవారు
విషాదం: మారథాన్ ప్రపంచ విజేత కెల్విన్ మృతి
మారథాన్ ప్రపంచ రికార్డ్ విజేత కెల్విన్ కిప్తమ్ (24) మరణించారు. ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో కిప్తమ్‌తో పాటు ఆయన కోచ్ గెర్వైస్ హకిజిమానా మృతిచెందారు. ఈ విషయాన్ని మరో క్రీడాకారిణి మిల్కా చెమోస్ ధ్రువీకరించారు. గతేడాది చికాగోలో 26.1 మైళ్ల దూరాన్ని 2 గంటల 35 సెకన్లలో పరిగెత్తి కెల్విన్ ప్రపంచరికార్డు సృష్టించారు. కెల్విన్ మృతిపట్ల తోటి అథ్లెట్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్