హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందుల నియంత్రణకు ట్రాన్స్జెండర్లను నియమించడంపై దృష్టి సారించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అధికారులను ఆదేశించారు. సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వెళ్లేవారిని నిరోధించేందుకు ప్రత్యేక డ్రెస్ కోడ్‌తో హోమ్ గార్డుల తరహాలో ట్రాన్స్జెండర్ల సేవలను ఉపయోగించుకోవాలని అన్నారు. వీలైనంత త్వరగా ప్రయోగాత్మకంగా నిర్ణయాన్ని అమలు చేయాలని సూచించారు.