గురక సమస్యలకు చికిత్స చేసేందుకు నిమ్స్ సిద్ధమవుతోంది. ఈ సమస్యతో బాధపడేవారికి ప్రత్యేక ల్యాబ్‌లో చికిత్స అందించనున్ముది.
ముఖ్యంగా అధిక బరువు, ధూమపానం, మద్యపానం అలవాట్లు, శ్వాస నాళాల్లో అడ్డంకులు ఉంటే స్లీప్ అప్నియా(గురక)కు దారి తీస్తుంది. గ్రేటర్ వ్యాప్తంగా 40-50 శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని నిమ్స్ వైద్యులు చెబుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రులతో పోలిస్తే.. నాలుగోవంతు ఖర్చుతోనే తమ వద్ద సేవలందిస్తామని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు.