బ్రిటన్ అవినీతి నిరోధక శాఖ మంత్రిగా ఉన్న తులిప్ సిద్ధిఖీ తన పదవికి రాజీనామా చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో ఆర్థిక వ్యవహరాలపై ఆరోపణలు రావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. షేక్ హసీనా సోదరి రెహానా కుమార్తెనే తులిప్ సిద్దిఖీ. ప్రస్తుతం ఆమె లేబర్ పార్టీ తరపున పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నారు. తాను తప్పుచేశాననే ఆధారాలు ఎక్కడా లేవని ఆమె ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ప్రధాని ఖేర్ స్టార్మర్ ఆమెకు మద్దతుగా నిలిచారు.