మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదం ఖార్గోన్లో ఆదివారం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న వ్యాన్‌ను ఓ కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాంలాల్ (వరుడి సోదరుడు), బంధువు శోభరామ్ (50) ప్రాణాలు కోల్పోయారు. స్కార్పియో డ్రైవర్‌తో పాటు వ్యాన్‌లో ఉన్న మరో ఐదుగురు వివాహ అతిథులకు గాయాలయ్యాయి.