ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు వందే భారత్ రైళ్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కానీ తిరునల్వెలి నుంచి చెన్నైకి ప్రయాణించే వందే భారత్ రైల్లో ఓ ప్రయాణికుడికి వడ్డించిన భోజనంలో కీటకాలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగుర్ ‘X’లో పోస్ట్ చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ట్యాగ్ చేశారు.