మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్‌లో భారత్ అదరగొడుతోంది. నేడు మలేసియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించడంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మలేసియా 31 పరుగులకే ఆలౌటైంది. ఇందులో 11 ఎక్స్ ట్రాలు ఉండటం గమనార్హం. వైష్ణవి శర్మ (5/5) ఆయుషి శుక్లా (3/8) కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో మలేషియా 14.3 ఓవర్లలో 31 పరుగులకే ఆలౌట్ అయింది.