తనపై హత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ భారత ప్రభుత్వంతో పాటు పలువురి పేర్లను ప్రస్తావిస్తూ అమెరికాలోని సదరన్ న్యూయార్క్ జిల్లా కోర్టులో సివిల్ దావా వేశారు. దీంతో కోర్టు భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది. ఆ సమన్లలో జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్, రీసెర్చ్ & అనాలసిస్ వింగ్ (R&AW) మాజీ చీఫ్ సమంత్ గోయల్, రా ఏజెంట్ విక్రమ్ యాదవ్, భారతీయ వ్యాపారవేత్త నిఖిల్ గుప్తా పేర్లను ప్రస్తావించింది.