వికారాబాద్ జిల్లాలో హెల్త్ కోర్సులు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని పారా మెడికల్ బోర్డు ఈనెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో డీఎల్ఎంటీ 30 సీట్లకు 25 దరఖాస్తులు, డీడీఐఎఎల్‌వై 30 సీట్లకు 5 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ఆసక్తి గల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.