మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపొందిన నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండల కేంద్రమైన తాడిచర్ల తో పాటు మండలంలోని కొయ్యూరు గ్రామంలో ఆదివారం టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల సంబరాలు మిన్నంటాయి. కేసీఆర్ చేసిన అభివృద్ధిని మునుగోడు ప్రజలు గుర్తించి ధర్మానికి పట్టం కట్టారని అన్నారు. ఈ సందర్భంగా మునుగోడు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.