ఉత్తరప్రదేశ్‌లో UPSC పరీక్ష అభ్యర్థుల ఆందోళనలు మూడో రోజుకు చేరాయి. ‘వన్ డే వన్ ఎగ్జామ్’ మా నినాదం అంటూ వారు ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. తాము విద్యార్థులమే కానీ విప్లవకారులం కాదన్నారు. సీఎం యోగిపై తమకు నమ్మకం ఉందన్నారు. తమ అభ్యర్థనలను స్వీకరించి, డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.