కత్తితో దాడి.. ఆసుపత్రికి తరలింపు
డోర్నకల్ మండలం తెల్లబండ తండాలో సోమవారం యుగేందర్ పై అదే తండాకు చెందిన నరేశ్ కత్తితో దాడి చేశాడు. బాధితుడి వివరాల ప్రకారం.. నరేష్ కు రెండు వేల అప్పు ఉండగా.. తండా శివారులో యుగేందర్, తన సోదరుడు ఉపేందర్ ను అడ్డగించి నరేశ్ ఆటోలో ఉన్న కత్తితో దాడి చేశాడు. అతనిని హుటా హుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.