పెంపుడు కుక్క వల్ల గొడవ.. వృద్ధులపై బాలికల దాడి (వీడియో)

70చూసినవారు
పెంపుడు కుక్క వల్ల చెలరేగిన గొడవ భౌతిక దాడులకు తెరలేపింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సొసైటీ కాంపౌండ్‌లో ఈ ఘటన జరిగింది. బెల్టు లేకుండా ఓ పెంపుడు కుక్క తిరుగుతుండడంతో ఓ వృద్ధ దంపతులు ప్రశ్నించారు. దీంతో కుక్కను తీసుకువచ్చిన ఇద్దరు బాలికలు వారితో గొడవకు దిగారు. ఈ క్రమంలో పెద్ద వారు అని కూడా చూడకుండా వారిని కొట్టారు. ఈ ఘటనను వృద్ధుడు తన కెమెరాలో బంధించాడు.

సంబంధిత పోస్ట్