సిఆర్పిఎఫ్ జవాన్లతో కవాతు

555చూసినవారు
సిఆర్పిఎఫ్ జవాన్లతో కవాతు
పార్లమెంటు ఎన్నికలు-2024 నిర్వహణలో భాగంగా గురువారం చిన్న గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల గుండంరాజు పల్లి, మంగోరి గూడెం మరియు చిన్న గూడూరు మండల కేంద్రంలో చిన్న గూడూరు పోలీస్ వారి ఆధ్వర్యంలో సిఆర్పిఎఫ్ జవాన్ల తో కవాతు ను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ఎలాంటి ప్రలోభాలకు, ఏటువంటి భయభ్రాంతులకు లోను కాకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవలసిందిగా ఎస్సై ఝాన్సీ తెలిపారు.