రష్యాపై తీవ్ర ఆరోపణలు చేసిన అమెరికా

82చూసినవారు
రష్యాపై తీవ్ర ఆరోపణలు చేసిన అమెరికా
ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా అంతర్జాతీయ రసాయన ఆయుధాల నిషేధాన్ని ఉల్లంఘించిందని అమెరికా ఆరోపించింది. ఉక్రెయిన్ దళాలకు వ్యతిరేకంగా విషవాయువు క్లోరోప్రిక్రిన్‌ను కీవ్‌లో ఉపయోగించడం సరికాదని తెలిపింది. ‘విషపూరితమైన రసాయనాల ఉపయోగం మంచిది కాదు. ఉక్రెనియన్ దళాలను తరిమికొట్టాడానికి, యుద్దంలో వ్యూహాత్మక విజయం సాధించాలనే ఆలోచనతోనే వీటిని ఉపయోగించి ఉండొచ్చు’ అని అమెరికా విదేశాంగశాఖ పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్