Jan 02, 2025, 13:01 IST/
కేటీఆర్ రేపో, మాపో జైలుకు పోవడం ఖాయం: కడియం
Jan 02, 2025, 13:01 IST
కేసీఆర్ కుటుంబంలో అందరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి మండిపడ్డారు. జనగామ జిల్లా చిల్పూర్(M) మల్కాపూర్‌లో ఆయన మాట్లాడుతూ.. 'లిక్కర్ కేసులో కవిత తీహార్ జైలుకు వెళ్లింది. ఫార్ములా ఈ కేసులో రేపో మాపో కేటీఆర్ జైలుకు పోవడం ఖాయం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీశ్ రావు తప్పులు చేసారని ఘోష్ కమీషన్ చెప్తోంది. మీరు నీతిమంతులైతే.. ఇన్ని రకాలైన ఆరోపణలు మీ మీదే ఎందుకు వస్తున్నాయి' అని మండిపడ్డారు.