రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో భారీ మహాత్మాగాంధీ విగ్రహా ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సభ్యులు మంగళవారం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రమైన జనగాం నగరంలోని గాంధీ విగ్రహానికి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ జనగామ జిల్లా అద్యక్షుడు కన్న పరశురాములు తమ టీం సభ్యులు కృష్ణ, శ్రీనివాస్, నర్సింహులులతో కలిసి పూలమాలలు వేసి హర్షం వ్యక్తం చేసారు.