జనగామ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మీడియా కేంద్రం, జీ6, జీ5/ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన బచ్చన్నపేట, నర్మేట, దేవరుప్పుల మండలాల సమగ్ర ఇంటింటి సర్వే డేటా ఆన్ లైన్ కంప్యూటరీకరణ ప్రక్రియను ఆయన పరిశీలించి తగిన సూచనలు చేశారు.