మద్యం అమ్మకాల్లో అక్రమాలపై ప్రభుత్వం సీరియస్
AP: మద్యం అమ్మకాల్లో అక్రమాలపై ఏపీ ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ధరల ఉల్లంఘనలపై సర్కార్ సీరియస్ అయ్యింది. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రూ.5 లక్షలు జరిమానా విధించనుంది. రెండోసారి కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.