AP: కాకినాడ పోర్టు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్‌లో 41.12 శాతం వాటాను అరబిందో దక్కించుకోవడంపై సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్‌కు ఆ సంస్థ చైర్మన్ కేవీ రావు ఫిర్యాదు చేశారు. తమను బెదిరించి మేజర్ వాటాను కైవసం చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాగా, బియ్యం అక్రమ రవాణా ఆరోపణల నేపథ్యంలో ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.