నితీశ్‌ను కలిసిన ఫ్యామిలీ.. ఎమోషనల్ వీడియో
మెల్బోర్న్ టెస్టులో తెలుగు కుర్రాడు, క్రికెటర్ నితీశ్‌కుమార్ రెడ్డి సెంచరీ చేసి అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మ్యాచ్ ముగిసిన అనంతరం నితీశ్‌ను అతడి కుటుంబ సభ్యులు కలిశారు. నితీశ్‌ను హగ్ చేసుకుని ఎమోషనల్ అయ్యారు. "ఈ రోజు నితీశ్ గేమ్ చాలా బాగా ఆడాడు. చిన్నప్పటి నుంచి నితీష్ చాలా కష్టపడ్డాడు. మేము చాలా గర్వపడుతున్నాం." అని నితీశ్ తండ్రి ముత్యాల రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.