AP: కడప పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించాలని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. ఇది సంబంధం లేని ప్రశ్న అని పవన్ కళ్యాణ్ సమాధానం దాటవేశారు. మనుషులు చనిపోతే సినిమాల గురించి ఏం మాట్లాడుతామని పవన్ కళ్యాణ్ ఎదురు ప్రశ్న వేశారు. ఇంతకన్నా పెద్ద సమస్యల గురించి ప్రస్తావించాలని.. సినిమాను మించిన సమస్యలపై డిబేట్ పెట్టండి. అడగండి అని పవన్ అన్నారు.