

రోడ్డు ప్రమాదంలో కారు ఢీ కొని మహిళ మృతి (వీడియో)
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బిజ్నోర్ జిల్లా బండ్కి సమీపంలో రోడ్డు పక్కన నడుస్తున్న ఒక మహిళను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో సదరు మహిళ అక్కడికక్కడే మరణించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.