TG: రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో మాకు తెలియదా అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ బయటి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పెద్దలకు డబ్బులు పంపే పనిలో రేవంత్ బిజీ అయ్యారని, అందుకే అసెంబ్లీకి రాలేదని ఆరోపించారు. రేవంత్ సాగర్ సొసైటీలో ఎంత సమయం గడిపేవాడో కూడా తెలుసని, ఇప్పటకీ మైహోం బూజాకు వెళ్తున్నాడని చెప్పారు. బీజేపీ నేతల బాగోతాలు కూడా తమ వద్ద ఉన్నాయని కేటీఆర్ అన్నారు.