Apr 14, 2025, 02:04 IST/
ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Apr 14, 2025, 02:04 IST
AP: బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పొన్నపల్లి గ్రామానికి చెందిన మున్నం గోవర్ధన్ రెడ్డి చిన్న కుమారుడు ప్రశాంత్ రెడ్డి (18) ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. శనివారం ఇంటర్ ఫలితాలు విడుదల కాగా.. ప్రశాంత్ రెడ్డి ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు. దాంతో మనస్తాపానికి గురై ఆదివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.