Oct 27, 2024, 08:10 IST/
ఎస్బీఐ అరుదైన ఘనత
Oct 27, 2024, 08:10 IST
దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్‌గా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిచింది. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఎస్బీఐను బెస్ట్ బ్యాంక్‌గా ఎంపిక చేసింది. వాషింగ్టన్లో జరిగిన ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు సమావేశంలో భాగంగా 31వ వార్షిక ఉత్తమ బ్యాంక్ అవార్డుల కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ఈ అవార్డును అందుకున్నారని బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది.