ఏపీలో ఆ ఉద్యోగుల తొలగింపు
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో రాజకీయ నేతల సిఫార్సులతో ఏపీఎండీసీ (ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ)లో ఎడా పెడా ఉద్యోగాలు ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. అయితే సిఫార్సులతో ఉద్యోగాలు పొందిన వారికి ఆ శాఖ ఎండీ చెక్ పెట్టారు. పొరుగు సేవల కింద పని చేస్తున్న 45 మందిని, కాంట్రాక్టు విధానంలో తీసుకున్న 50 మందిని అధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ మేరకు ప్రభుత్వం మొత్తం 95 మంది ఉద్యోగులను తొలగించారు.