నల్గొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభకు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత మంగళవారం బయలుదేరి వెళ్లారు. ముందుగా హైదరాబాద్ లో తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళుర్పించారు. నల్గొండలో నిర్వహిస్తున్న సభకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.