
23న యువత పోరుబాట: YCP
AP: ఈ నెల 23న తమ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరుబాట నిర్వహిస్తున్నట్లు YCP తెలిపింది. నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ చంద్రబాబు సర్కారుపై నిరసన గళం వినిపించాలని పిలుపునిచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ యువతకు ప్రభుత్వం నెలకు రూ.3,000 భృతి తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేసింది. నిరుద్యోగులతో కలిసి అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా చేసి డిమాండ్లతో వినతిపత్రం ఇస్తామని తెలిపింది.