బడ్జెట్‌లో బంగారంపై కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో దిగుమతి భారం తగ్గింది. పసిడి అక్రమరవాణాను అరికట్టేందుకు సుంకం తగ్గించాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు తర్వాత ఆభరణాల కొనుగోలుకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో సుంకాన్ని తగ్గించడంతో సుమారు కిలోకు రూ.3.90 లక్షల వరకు ధర తగ్గడం గమనార్హం.