ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

269చూసినవారు
ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని పద్మశాలి భవనంలో మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని మానుకోట జిల్లా పద్మశాలి సంఘం కోశాధికారి, మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు పెండెం రమేష్ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం పద్మశాలీల ఆత్మగౌరవానికి నిదర్శనమన్నారు. 2015 ఆగస్టు 7న మొట్టమొదటి జాతీయ దినోత్సవం జరిగిందన్నారు. నాటి నుండి ప్రతి సంవత్సరం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ కృషి వల్లనే, వారి పోరాటం వల్లనే జాతీయ చేనేత దినోత్సవ ఆవిర్భావం జరిగిందన్నారు.

సమస్త మానవాళి మాన మర్యాదలు కాపాడిన కులవృత్తి చేనేత. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేయడం పద్శశాలీల యొక్క గొప్పతనం అన్నారు. కానీ ప్రభుత్వాల కపట ప్రేమతో నేడు నేతన్న బలవన్మరణానికి పాల్పడుతున్నాడన్నారు. చేనేత కార్మికుల ఆకలి చావులు ఆగడానికి రాష్ట్ర ప్రప్రభుత్వం చొరవతీసుకుని ప్రత్యేక పద్మశాలి కార్పోరేషన్ ఏర్పాటు చేసి ఋణ సదుపాయాలందించి ప్రతి మండల కేంద్రానికి ఒక మిని టెక్స్ టైల్స్ పార్క్ ఏర్పాటు చేసి వారికి మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు.

ఈ కార్యక్రమంలో మానుకోట జిల్లా పోపా ప్రధానకార్యదర్శి బుదారపు శ్రీనివాస్, పద్మశాలి నాయకులు కూరపాటి సోమయ్య, తుమ్మ వెంకటేశ్వర్లు, చందా రవీందర్, కస్తూరి పులేందర్, పెండెం ఉప్పలయ్య, ఎనగందుల సంతోష్, రేగొండ వెంకటేశ్వర్లు, కళ్యాణపు రాజు, కోట వెంకటేశ్వర్లు, చిలుకమారి భాస్కర్, మోతె పెద్ద ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :