సెల్‌ఫోన్లు ఉన్నవారికి శుభవార్త. కేంద్రం తీసుకొచ్చిన ‘సంచార్ సాథీ’ పోర్టల్ మొబైల్ వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. దీని ద్వారా దొంగిలించబడిన మొబైల్‌ను IMEI వివరాలతో వెంటనే బ్లాక్ చేయవచ్చు. అలాగే మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో వివరాలు కూడా తెలుసుకోవచ్చు. సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు చేసే వారు దాని పూర్వాపరాలను ఈ పోర్టల్‌లో చెక్ చేసుకోవచ్చు. కాల్స్, మెసేజ్‌ల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడినట్లు తేలితే ఫిర్యాదు చేయవచ్చు. వెబ్‌సైట్ https://sancharsaathi.gov.in/