Oct 27, 2024, 08:10 IST/
ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కీలక నిర్ణయం?
Oct 27, 2024, 08:10 IST
బ్యాక్ లాగ్ ఉద్యోగాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు ఎంపికవడం, వారు ఒక ఉద్యోగంలో చేరగానే మిగతా జాబ్స్ బ్యాక్ లాగ్ అవుతుండటం తెలిసిందే. తాజాగా గురుకులాల్లో 2వేల పోస్టులు మిగిలిపోయాయి. దీంతో తిరిగి 'రీలింక్విష్ మెంట్'ను అమల్లోకి తీసుకురావడంపై సర్కారు యోచిస్తోంది. ఎక్కువ పోస్టులకు ఎంపికైన వారి నుంచి మిగతా ఉద్యోగాలను వదులుకున్నట్లు అంగీకార పత్రం తీసుకుంటుంది. దీంతో ఆ జాబ్ తదుపరి మెరిట్ అభ్యర్థికి దక్కుతుంది.