గోడ కూలి వృద్ధురాలు మృతి
మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని పెద్దవంగర మండలం గంట్లకుంట్ల గ్రామంలో ఆదివారం ప్రహరీ గోడ కూలి బెల్లంకొండ భద్రమ్మ అనే (55) వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంటి ముందర గోడ ఇటీవల కురిసిన వర్షాలకు నాని భద్రమ్మ పై పడడంతో మృత్యువాత పడ్డారు.