Oct 13, 2024, 12:10 IST/
సీపీఐ నారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు.. వీడియో
Oct 13, 2024, 12:10 IST
TG: అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరు కాలేను క్షమించండని సీపీఐ నారాయణ తాజాగా ఆదివారం ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. "ప్రొసెఫర్ సాయిబాబాను కేంద్రం జైలులో పెట్టించింది. కనీసం బెయిల్ కూడా రాకుండా చేసింది. ఆయనకు, నాకు రాజకీయ బేధాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. ప్రొ.సాయిబాబాను రాష్ట్రం నుంచే కాదు ప్రపంచం నుంచే దూరం చేసిన ప్రభుత్వానికి ప్రాతినిధ్యం ఎలా వహిస్తారు? మీ ఆహ్వానానికి ధన్యవాదాలు.. కానీ నిరసనగా అలయ్ బలయ్ కు రావడం లేదు" అని పేర్కొన్నారు.