సొంత పనులకు ప్రభుత్వ వాహనం

64చూసినవారు
గత ప్రభుత్వం పలుశాఖలకు బైక్ లను కేటాయించింది. ఆ వాహనాలను ప్రభుత్వపరమైన అవసరాలు, విధి నిర్వహణకు మాత్రమే వినియోగించాల్సి ఉంది. అయితే కొంతమంది ఉద్యోగులు తమ సొంత అవసరాలకు బైక్లను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శుక్రవారం గవిచర్ల క్రాస్ రోడ్డులోని ఓ వైన్ షాప్ వద్దకు ప్రభుత్వ బైక్ పై ఓ ఉద్యోగి వెళ్లడాన్ని గమనించిన కొంతమంది సోషల్ మీడియా ఆ దృశ్యాన్ని అప్లోడ్ చేయడంతో వైరల్గా మారింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you